మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య పాశవిక దమనకాండ కారకులకు ఉరిశిక్ష వేయాలి జే క శేఖర్ ఎంపిటిసి ఆదివాసి జిల్లా నాయకులు


చెన్నూర్ 20 జూలై (జనం సాక్షి) ; మణిపూర్ రాష్ట్రంలో మెజార్టీ వర్గం మైతేయులు మైనార్టీ తెగకు చెందిన కుకీ ఆదివాసులపై వర్గ పోరులో భాగంగా హింసలు పెట్రేగి ఒక వర్గంపై మరొక వర్గం మహిళలపై పాశవిక దాడులకు పాల్పడడం భారత సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని జేక శేఖర్ ఆదివాసి జిల్లా నాయకులు అన్నారు ఈ చర్యల్లో భాగంగా మూడు(03) మే రోజున గ్రామంలోని మహిళలను మెజార్టీ వర్గమైన మైతేయులు కుకీ మహిళలను అపహరించుకొని పోయి చిత్ర హింసలకు గురిచేసి సభ్య భారతావని సిగ్గుపడేలా అమాయక నిర్భాగ్యులైన ఆడబిడ్డలను వి వస్త్రాలను చేసి రోడ్ల గుండా ఊరేగిస్తూ ఆడవారి జననాంగాలను స్పృశిస్తూ పాషవికానందాన్ని పొందడం సిగ్గుచేటు అని ఆదివాసి సంఘం తీవ్రంగా ఖండించడం జరుగుతుందని అన్నారు సభ్య సమాజం తలదించుకునేలా అరాచక వాదులు అమాయక గిరిజనులను వస్త్రహీనులుగా చేసి ఊరేగించడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడి హత్య చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని ఇలాంటి జాతి మత ద్రోహుల పాషవిక క్రూర మానవ మృగాల చర్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు చూస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా మెజార్టీ వర్గ ప్రజల ద్వారా మైనారిటీ తెగలకు నష్టం కలిగించే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మణిపూర్లో ఇంతటి ఘోరమైన విపత్కర చర్యలు మైనార్టీ జాతుల విచ్ఛిన్నకర ఘోరాన్ని అదుపు చేయడంలో పూర్తిగా విఫలం చెందిన సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సహించరాని చర్య జాతుల మధ్య హింసను ప్రోత్సహించడమే అవుతుందని ఇట్టి ద్వంద్వ విధానాలను ఆదివాసి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య జరుగుతున్న పాషవిక దమన కాండను ప్రపంచంలోని మానవతావాదులు స్వచ్ఛంద సంస్థలు దేశంలోని (NRI) ఎన్నారైలు ప్రతిపక్షాలు సినీ ప్రముఖులు దేశ సమగ్రతను కాపాడే మానవాళి ముక్తకంఠంతో యావత్ భారతావని ఖండించాలని రాష్ట్రపతి సుప్రీంకోర్టు స్పందించి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది సర్వ సమాజం సిగ్గుపడే విధంగా మహిళలను ఊరేగిస్తూ పా శవిక ఆనందాన్ని పొంది అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తుందని అన్నారు

తాజావార్తలు