మణిపూర్ లో దాడులను నిరసిస్తూ ర్యాలీ
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం సూర్యాపేట పాస్టర్స్, క్రైస్తవ సంఘాల సహకారంతో జిల్లా కేంద్రంలోని బాప్టిస్ట్ చర్చి నుంచి ప్రధాన వీధుల గుండా భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ చైర్ పర్సన్ మామిడి సామ్సన్, తెలంగాణ బాప్టిస్ట్ కన్వెన్షన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ సారధ్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకిక, ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో క్రైస్తవ మహిళలపై దాడి హేయమైన చర్య అని అన్నారు.స్త్రీలకు అత్యంత గౌరవం ఇచ్చే ఈ దేశంలో వారిపై సామూహిక అత్యాచారాలు, దాడులు జరగడం బాధాకరమని అన్నారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పి.పూర్ణశశి కాంత్, పాస్టర్స్ ఫెలోషిప్ నియోజకవర్గ అధ్యక్షులు మీసాల గోవర్ధన్, పట్టణ అధ్యక్షులు మీసాల ప్రభుదాస్, పాస్టర్లు సాయిని జాకబ్, సామ్యూల్ కిరణ్, బాబురావు కరుణాకర్, బొడ్డు మత్తయ్య, డేవిడ్ రాజ్ , రాజారత్నం, మణిదాస్, సజీవ, డి పాల్ జవహర్ పాల్, మరియన్న , లింగా నాయక్ , శాంతి కుమార్, వినీల్ , శామ్యూల్, విజయరాజు, బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ హుబెర్ట్ రాజన్, వంగూరు డానియలు , చెట్టుపల్లి దేవయ్య, వలపట్ల దయానంద, ఎలియజర్, పి.కవిత, విజయకుమారి, సుజన , ఎస్తేర్, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.