మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జోగులాంబ గద్వాల జిల్లా చైర్మన్ గా టీ. గోపాల్ నియామకం
గద్వాల నడిగడ్డ, జులై 21 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా మత్స్య శాఖ అధికారి షకీలా భాను అధ్యక్షతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్ల ఎన్నిక ప్రకటన ను జూన్ 23 న పూర్తి చేశారు. ఈ ఎన్నికలో తుది ఫలితం ప్రకారము శుక్రవారం జిల్లా మత్స్య శాఖ కార్యాలయం నందు పుల్లూరు కు చెందిన టి.గోపాల్ ని జోగులాంబ గద్వాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ గా, పదిమందిని డైరెక్టర్లుగా నియామకం చేయడం జరిగింది.మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గా ముగ్గురు సభ్యులు పోటిపడగా అందులో గోపాల్ కు ఎక్కువ ఓట్లు రావడం తో కలెక్టర్ అనుమతితో శుక్రవారం తుది ఫలితం ప్రకటించడం జరిగింది. అందులో జిల్లా చైర్మన్ గా టి గోపాల్, డైరెక్టర్లుగా గుర్రం గడ్డ సంజీవులు, జే.చెన్నయ్య , సుధాకర్ ,మద్దిలేటి గంగాధర్, తిమ్మప్ప ,రాముడు, రంగన్న, లక్ష్మన్న ,మద్దిలేటి, చిన్న రంగన్న , మొదలగు వారితో కమిటీ నీ ఏర్పాటు చేయడమైనది.ఈ ఎన్నిక మత్స్యశాఖను బలోపేతం చేయడంలో ఎంతో కీలకంగా ఉంటుందని రానున్న రోజుల్లో చైర్మన్ గోపాల్ సహకారంతో మత్స్యశాఖను మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్క మత్స్యకారునికి తగువిధంగా ప్రభుత్వ పథకాలు అందేలాగా కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార చైర్మన్ గా నియామకం చేసినందుకు మత్స్యకార సొసైటీల అధ్యక్షులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.