మద్యం దుకాణదారుల ఆస్తుల పత్రాల పరిశీలన

హైదరాబాద్‌: మద్యం దుకాణదారులు సమర్పించిన ఆస్తుల పత్రాల వివరాల పరిశీలన సాగుతోంది. రెండు నెలలు అయినా ఇప్పటి వరకు కేవలం 50 శాతం మందికి చెందిన పత్రాలను మాత్రమే అధికారులు పరిశీలించగలిగారు. వాస్తవానికి పత్రాలను ఎక్సైజ్‌శాఖ అధికారులు పరిశీలించాలి. కానీ గ్రామాల్లో కల్లీ మద్యం విక్రయాలు జరక్కుండా చూడటం, ఎమ్మార్పీ ఉల్లంఘనలపై దృష్టిసారించడం తదితర పనులతో ఎక్సైజ్‌ శాఖ తీరికలేకుండా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 5,959 దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. గతంలో కొందరు వ్యాపారులు నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో నిశితంగా పత్రాలపై దృష్టిసారించాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. ఆ బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది.

తాజావార్తలు