మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్…. గొల్లపల్లి బాపురెడ్డి
బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 15
మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో ఎస్ఎంసి చైర్మన్ గొల్లపల్లి బాపురెడ్డి మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఏడు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా వడ్డిస్తున్నారని వివరాలు తెలుసుకోవడం జరిగిందని. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. అలాగే గత రెండు సంవత్సరాల కాలం నుండి మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన వేతనాలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాల కాలం నుండి గ్రామ పంచాయతీకి సంబంధించిన మురుగునీరు పాఠశాల ఆవరణలో చేరి ఈగల దోమలు బారిన పడి విద్యార్థులు ఆరోగ్యాలు నష్టపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని తక్షణమే పాఠశాల ఆవరణలోకి వచ్చే గ్రామపంచాయతీ మురుగునీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా బయటికి పంపించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయన వెంట ఉన్నారు