మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
ఏలూరు,ఆగస్ట్29(జనంసాక్షి): బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా పశ్చిమ గోదావరిని తీర్చిదిద్దటానికి కంకణం కట్టుకున్నామని జడ్మీఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెల్లడించారు. జిల్లాలో అవసరమున్నన్ని మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే వేలాదిగా మరుగుదొడ్లు పూర్తి చేశామని చెప్పారు.గ్రామాల్లో సిమెంటు రహదారులు, శ్మశానవాటికల అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకొచ్చి 30 శాతం నిధులు ఇస్తే దానికి తోడు 70 శాతం నిధులు జిల్లా పరిషత్ నుంచి ఇస్తామని తెలిపారు. పోలవరం కుడికాలువ నుంచి కొవ్వాడ జలాశయంలోకి నీరు విడుదల చేయాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేశారు. అలా చేయటం వల్ల బీడు భూములుగా మారిన వేల ఎకరాలు సాగులోకి వస్తాయని ఛైర్మన్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. నదుల అనుసంధానంతో పాటు అభివృద్ది కార్యక్రమాల కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అంతా కలసి రావాలన్నారు. దళిత, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు.