మహానదుల సంగమం’ ప్రారంభానికి అడ్డంకి..
పశ్చిమగోదావరి : గోదావరి – కృష్ణమ్మలను కలిపే ముహూర్తం మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేసేందుకు 8.45 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేయనున్నారు. కానీ ఈ ముహూర్తం సమయాన్ని మార్చారు. సాయంత్రం 03.45గంటలకు పోస్టుపోన్డ్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. దీనితో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. వాస్తవానికి సాంకేతిక కారణాలే సమయం పొడిగింపునకు కారణమని తెలుస్తోందివిజయవాడ సమీపాన ఇబ్రహీంపట్నం సెంటర్ లో నిర్మించిన స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆఘమేఘాల మీద చేస్తున్నారు. సుమారు 20 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు టిడిపి శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నారు. 250 బస్సుల్లో రైతులను తరలించేందుకు టిడిపి నేతలు శ్రమిస్తున్నారు.