మహారాష్ట్ర వర్షాలే మనకు దిక్కు

ఆల్మట్టి వైపు అధికారుల చూపు

కర్నూలు,ఆగస్ట్‌3: ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండితేనే కిందికి కృష్ణా నీరు రానుంది. అప్పుడే తెలంగాణ,ఎపిల్లో కృష్ణానదికి నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర విూదుగా జూరాలకు నీరు చేరితేనే శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వస్తుంది. ప్రతియేటా ఆగస్ట్‌ వరకల్లా వరదలు వచ్చేది. ఈ యేడు ఇప్పుడు ఇంతవరకు నీటిరాక మొదలు కాలేదని అధికారులు అన్నారు. అయితే మహారాష్ట్రలోని

మహాబలేశ్వరం, ముంబై తదితర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలకు వరద మొదలైంది. కృష్ణానది జన్మస్థలమైన మహాబలేశ్వరంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు 36 సెంటీవిూటర్లు నమోదైనట్టు అంచనా. అక్కడి నుంచి ఈ రెండు రోజుల్లో దాదాపు లక్ష క్యూసెక్కులు దిగువకు వచ్చే అవకాశం ఉన్నది.ఆల్మట్టికి మరో రెండుమూడు రోజుల్లో దాదాపు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రానున్నదని కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో జలాశయం నుంచి నీటిని పవర్‌హౌస్‌ ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ వరద ఇంకా నారాయణపూర్‌ ప్రాజెక్టుకు చేరాల్సి ఉంది. ఆల్మట్టి నుంచి బుధవారం ఉదయం వరకు 20 వేల క్యూసెక్కులు ఉండగా సాయంత్రానికి 31వేలకు పెంచారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి ఇంకో మూడు టీఎంసీల అవసరం ఉంది. ఈ రెండు రోజులూ ఆల్మట్టి నుంచి ఇదే వరద కొనసాగితే నారాయణపూర్‌ జలాశయం నిండనుంది. అయితే ఎగువ నుంచి వరద వస్తుండటంతో నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి కూడా గురువారం సాయంత్రం వరకు గేట్లు ఎత్తే అవకాశాలున్నాయని అక్కడి ప్రాజెక్టు ఇంజినీర్‌ రాఘవేంద్ర తెలిపారు. ఉజ్జయిని నుంచి 25 వేల క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి దాదాపు 30వేల క్యూసెక్కుల వరద వస్తే జూరాలకు 55వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉండనున్నది. ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా స్పిల్‌వే గేట్లను ఎత్తి బుధవారం సాయంత్రం వరకు 40 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రవాహం మరో వారం కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరుకలెత్తుతున్నది. ఆల్మట్టి నుంచి పవర్‌హౌస్‌ ద్వారా 31వేల క్యూసెక్కులు విడుదలచేస్తున్నారు. కర్ణాటకలోని ¬స్పేట వద్ద ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకూ ఇన్‌ఫ్లో పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 23వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.భీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. రెండ్రోజుల్లో ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నదని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో పెరుగడంతో దీనికి అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు, కాల్వలకు నీటిని విడుదలచేస్తున్నారు. ఎగువ నుంచి ఉజ్జయిని ప్రాజెక్టులోకి 53వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఈ నీటితో జూరాల పూర్తిగా నిండి దిగువకు వదిలితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరుగనున్నది. ప్రస్తుతం ఉజ్జయిని స్పిల్‌వే గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటితో జూరాలకు ఇన్‌ఫ్లో పెరిగింది. కాగా ప్రస్తుతం ఉజ్జయినీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు భీమా ద్వారా తంగిడి వద్ద కృష్ణాలో కలుస్తున్నది. ఎగువ నుంచి జూరాలకు 10 వేల క్యూసెక్కులు వస్తున్నది.

ఎగువ నుంచి వరద సమాచారంతో ఆల్మట్టి నుంచి బుధవారం సాయంత్రం పవర్‌హౌజ్‌ నుంచి 31వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ వరద మొత్తం నదిలోకి రానుండడంతో నేడో, రేపో ఎగువ నుంచి వరద మరింత పెరిగితే జూరాల స్పిల్‌వే గేట్లను ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కర్ణాటకలోని ¬స్పేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. రెండు, మూడ్రోజుల కిందటివరకు ఏడు వేల క్యూసెక్కులతో కొనసాగిన ప్రవాహం, మంగళవారం అర్ధరాత్రి నుంచి పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. తుంగభద్రకు కూడా వరద పెరుగడం, తద్వారా నీటి నిల్వ పెరుగుతుండటంతో జిల్లాలోని ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతుల్లో సంబురం నెలకొంది. 2010 నుంచి తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టానికి సగం దూరంలోనే ఉంటున్నది. కానీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు 64 టీఎంసీలకు చేరింది. 25వేల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.

తాజావార్తలు