మహిళలను అన్నిరంగాల్లో ముందుంచిన ఘనత టిడిపిదే

 

 

అసెంబ్లీ సిఎం చంద్రబాబు

అమరావతి,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌దే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. స్త్రీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చి వారికి సముచిత స్థానం దక్కేలా చేఇసన గనత కూడా టిడిపదేనని అన్నారు. గురువారం శాసనసభలో మహిళ సాధికారతపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని అన్నారు. మహిళ సాధికారత కోసమే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశానని ప్రస్తుతం డ్వాక్రా గ్రూపుల్లో 91లక్షల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించామని, కానిస్టేబుళ్ల నుంచి కండెక్టర్ల వరకు మహిళలను నియమించామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి డిక్లరేషన్‌లో అమ్మాయిలు విలువైన సూచనలు చేశారు. వాటిని అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువరు పలుసూచనలు చేశారు.

 

 

తాజావార్తలు