మహిళలపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర మహిళా సమాఖ్య నగర సమితి
విద్యాధరపురం : దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట మహిళా సమాఖ్య నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, మహిళా చట్టాలు సక్రమంగా అమలు పరచడంలేదని, మహిళలకు సరైన భద్రత కల్పించలేకపోతున్నారని విమర్శించారు. మహాత్ముడు మళ్ళీ పుట్టి మహిళా స్వతంత్రం కోసం పోరాడాలా అని ప్రశ్నించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొరగంజి దుర్గాంబ మాట్లాడుతూ మహిళలపై దాడులు అరికట్టేందుకు మహిళలంతా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.దుర్గా, ఆర్.రంగమ్మ, ఇ.లక్ష్మి, వి.రాణి, రమణమ్మ, ఎం.సుబ్బలక్ష్మి, సిహెచ్.పార్వతి, జి.రాహేలమ్మ, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు