మాజీ జడ్పీ ఛైర్మన్‌ చమన్‌ హఠాన్మరణం

పరిటాల కూతురు పెళ్లి వేడుకల ఏర్పాట్లలో విషాదం
చమన్‌ మృతితో స్పృహతప్పి పడిపోయిన సునీత
అనంతపురం,మే7(జ‌నం సాక్షి):  తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడైన చమన్‌(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్‌ మృతి చెందారు. పరిటాల రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్‌ హత్యల నేపథ్యంలో చమన్‌ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం… పరిటాల సునీత మంత్రి అవడంతో.. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్‌ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల పాటు జడ్పీ ఛైర్మన్‌గ ఆపనిచేశారు. ఆ తరువాత తన పదవికీ రాజీనామా చేశారు. మంత్రి పరిటాల సునీత కుమార్తె వివాహం నిమిత్తం చమన్‌ రెండ్రోజులుగా వెంకటాపురంలో ఉన్నారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో పరిటాల సునీత  షాక్‌ గురై స్పృహతప్పి పడిపోయారు. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నగర ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.
———————–

తాజావార్తలు