మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం


చొప్పదండి, ఆగస్టు 11 (జనం సాక్షి): మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంపకంపై బాధ్యతలు తీసుకోవాలని సిద్ధార్థ విద్య సంస్థల డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి సూచించారు. పట్టణంలోని
సిద్ధార్థ పాఠశాలలో హరితహారం పై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ శ్రీ దాసరి శ్రీపాల్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి ప్రమాణంగా నిలిచేందుకు ఉపన్యాస వ్యాసరచన పోటీలు తోడ్పాటు ఇస్తాయన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలలో చదువుతో పాటుగా అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యతనిస్తామని తెలియజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజావార్తలు