మార్కెట్ వేల్యూ ప్రకారం ధర చెల్లించండి

మక్తల్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి) మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామ రైతులు మక్తల్ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. భారత్ మాల 167 వ జాతీయ రహదారి కొరకు ప్రభుత్వం రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములను సేకరిస్తున్న విషయంలో మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కాకుండా ప్రభుత్వ ద్వారా చెల్లించడం కరెక్టు కాదని అన్నారు మార్కెట్ వేల్యూ ప్రకారం తమకు ధర చెల్లించాలని కోరారు. తమ అనుమతి లేకుండా భారత్ మాల భూసేకరణ చేపట్టకూడదని అన్నారు. అదేవిధంగా తమకు విలువైనటువంటి చిన్న సన్నకారు రైతుల భూములు ఉన్నాయని వాటిపైనే తమ జీవనాధారం ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఇలాంటి పంట భూములను ప్రభుత్వం అతి తక్కువ ధర చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. తమ అనుమతి లేకుండా భూ సర్వే చేపడితే ముక్కుమ్మడిగా ధర్నా నిర్వహిస్తామని వారు తాసిల్దార్ వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న, గ్రామ ఉపసర్పంచ్ గడ్డం నరసింహ, రైతులు ఆంజనేయులు, గోకరప్ప, వెంకటయ్య, వెంకటేష్, లింగప్ప తదితరులు ఉన్నారు.