మీడియా నిదేశం మంచిది కాదు

ఇటీవల జరిగిన డీఈవోల సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన విద్యార్థి సంఘాలు, మీడియా సంస్థలను విద్యాసంస్థల్లోనికి రానివ్వద్దని అక్కడ ఉండే సమస్యలను బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆదేశం మేరకు డిఇఓలకు ఆదేశం ఇవ్వడం జరిగింది… భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థి సంఘాలు, మీడియా సంస్థలు వారు బయటకు తీస్తున్నారని భావించి ప్రభుత్వ అర్ధం లేని నిషేధాన్ని ఆంక్షలు అమలు చేయడం అంటే విద్యారంగంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అర్థమవుతుంది విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబిస్తూ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా అధిక నిధులు కేటాయించకుండా పాఠశాల వసతి గృహాలు నూతన భవనాలు నిర్మించకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా మన ఊరు మనబడి కార్యక్రమం పేరుతో పాఠశాలలో సమస్యల పరిష్కారం కోసం ఏడువేల రెండు వందల కోట్లు కేటాయించగా అందులో నాలుగు వందల కోట్ల పై చిలుకు మాత్రమే ఖర్చు పెట్టడం పేదలు బడుగులు అభ్యసిస్తున్న ప్రభుత్వ విద్య పట్ల పాలకుల చిత్తశుద్ధి కనబడుతున్నది రాష్ట్రంలో తొంభై శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి మొత్తం విద్యారంగాన్ని గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పైన హక్కుల కోసం పోరాడే సంఘాల పై నిషేధం జారీ చేయడం సరైన పద్ధతి కాదు రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓలు, డిఈఓలు లేని పరిస్థితి వేలకొద్దీ ఉపాధ్యాయ ఖాళీలు కనీసం పాఠశాలల పరిశుభ్రత కోసం స్కావెంజర్లను నియమించ లేనటువంటి దుస్థితి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దాపురించింది ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడం కోసం సమస్యలను లేవనెత్తి పరిష్కారం దిశగా ఆలోచన చేసే విద్యార్థి సంఘాల పై మీడియా సంస్థలపై ఉక్కు పాదం మోపడం సమాజాసం కాదు ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి బయటపడుతుందని సమస్యల సుడిగుండంలో ఉన్న ఎక్కడ కూడా వాటిని బయటకు రాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులు యొక్క అనుచిత అప్రజాస్వామిక ఆలోచన విధానాల మూలంగా తెలంగాణలో విద్యారంగ మొత్తం కూడా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న దౌర్భాగ్య స్థితి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది తక్షణమే విద్యార్థి సంఘాలు మీడియా సంస్థలపై నిషేధ నిర్ణయాలను ప్రభుత్వం ఉన్నతాధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు మీడియా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉదృతంగా పోరాటాల నిర్వహిస్తామని ఒక ప్రకటనలో బచ్చలి ప్రవీణ్ కుమార్
విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు.

తాజావార్తలు