ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో మంజీరా పై చెక్ డ్యామ్ల నిర్మాణం

చెక్ డ్యామ్ల నిర్మాణంతో పెరిగిన భూగర్భ జలాలు

హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు

జనం సాక్షి/ కొల్చారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో మంజీరా నదిపై చెక్ డ్యామ్ ల నిర్మాణం చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగిపోయి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం యేనగండ్ల గ్రామం లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో మంజీరా నదిపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో నాలుగు చెక్ డాంల నిర్మాణం వల్ల నేడు భారీ వర్షాలకు చెక్ డ్యాములు నిండి పొంగిపొర్లుతున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పుష్కలంగా రెండు పంటలు పండించుకునేందుకు భూగర్భ జలాలు పెరిగిపోయాయని ఆమె తెలిపారు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు

తాజావార్తలు