ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

చొప్పదండి, ఆగస్టు 10 (జనం సాక్షి).. చొప్పదండి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా చేస్తూ 37 .5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ,లోక రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ ,గంగుల కమలాకర్ ,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజలు మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం కేంద్ర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 పడకలు మాత్రమే ఉండడంతో మండలంలోని ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని గతంలో ఎంతమందిని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వందపడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావులు స్పందించి వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 37.5 కోట్ల నిధులను మంజూరి చేస్తూ జీవో విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. వందపడకల ఆసుపత్రి గా అయిన తర్వాత చొప్పదండి మండలం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి ,ముఖ్యమంత్రి కేసీఆర్ కి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కి, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లకు రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఇప్పనపల్లి విజయలక్ష్మి- సాంబయ్య, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, దండే కృష్ణ ,మహేశుని మల్లేశం, నరేష్ రావణ్ ,పెద్దెల్లి అనిల్, మావూరపు మహేష్, కొత్తూరి నరేష్, తోడేటి డేవిడ్ ,కుమార్ చెట్టిపల్లి పద్మ, రమేష్ ,చోటు ,మధు, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు