మునిపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన – రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

 

 

 

 

 

మునిపల్లి, జూలై 12, జనంసాక్షి :
సీఎం కేసీఆర్ నాయకత్వన్నే తెలంగాణ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారాని మండిపడ్డారు. బుధవారం నాడు మునిపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందనడంతో మునిపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడ్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ తెచ్చిన పథకాలను అమలు చేస్తుంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టె రోజులు దగ్గలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వారణాసి సతీష్, శివశంకర్, రాంచందర్ రావు, రామకృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు, ఎంపీటీసీలు శివకుమార్, నాగేష్, సర్పంచ్లు రమేష్, వీరన్న , మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, హైద్లాపూర్ ఉపసర్పంచ్ విజయ్, బీఆర్ఎస్ మునిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నర్సింలు, చిన్నచెల్మెడ గ్రామశాఖ అధ్యక్షుడు మోహన్, గార్లపల్లి గ్రామశాఖ అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు