మూడు గంటల కరెంట్ తో మూడు ఎకరాల భూమిని పండిస్తావ రేవంత్ రెడ్డి ?
పెనుబల్లి, జులై12(జనం సాక్షి)
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు మూడు గంటలు మాత్రమే చాలు అనడాన్ని కండిస్తూ పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆద్వర్యంలో బుదవారం రామచంద్రరావుబంజర్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమా న్ని తెలిపారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నీవు వ్యవసాయం తెలిసినోడివి ఐతే మూడు ఎకరాల భూమిని మూడు గంటల కరెంటుతో పండించి చూపించాన్నారు, చేత కాక పోతే నేను మాట్లాడింది తప్పు అని బహిరంగంగా ఒప్పు కోవాలన్నారు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె రైతులకు ఇస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంట్ ను మూడు గంటలకు కుదిస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేసిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా అనడంపై కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఉన్న విలువను ప్రజలు గమనించాలని అన్నారు .24 గంటలు ఉచిత కరెంటు ద్వారా తెలంగాణ రాష్ట్రం వెలుగుతుంది అని అన్నారు, కెసిర్ ప్రభుత్వం వ చ్చిన నాటి నుండి ఇళ్లల్లో వేస వి కాలం తొ పాటు కరెంట్ ఏ నాడై నా కరెంట్ కోతలు చూ సామా అని అన్నారు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి దేశానికి తిండి గింజలు అందిస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, స్థానిక సర్పంచ్ వాసం రాణి, బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, మందడపు అశోక్, యలమర్తి శీను, మండల యూత్ వింగ్ వంగా నిరంజన్ గౌడ్, మల్లెల సతీష్, బజ్జూరి గోపి మరకాల చంటి, మరకాల వెంకీ,తాళ్లూరి శేఖర్, సోషల్ మీడియా మరీదు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.