మూడేళ్ల బాలికపై కుక్క దాడి
నందికొట్కూరు టౌన్: పట్టణంలో మంగళవారం మూడేళ్ల బాలికపై కుక్క దాడి చేసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి రోడ్డులో ఉదయం కిరాణం కొట్టుకు వెళుతున్న శృతి అనే చిన్నారిని నోట కరుచుకొని ఎత్తుకెళ్తుండగా బాలిక అరుపులు విని తల్లి, చుట్టు పక్కల ప్రజలు కుక్కను తరిమి బాలికను విడిపించారు. బాలిక శరీరంపై గాట్లు పడ్డాయి. గాయపడిన చిన్నారిని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రహ్ల్లాద సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడిన బాలికను పరామర్శించారు. కుక్కల తరలింపునకు చర్యలు చేపడతామన్నారు. పట్టణంలో మూడు నెలలో వ్యవధిలో పగిడ్యాల రోడ్డులో ట్యాంకు ఏరియాలో ఏడుగురు, మండల పరిధిలోని కొణిదేల, మల్యాల గ్రామాల్లో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు చర్యలు తీసుకొని కుక్కల సంచారానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు