మూఢనమ్మకాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
వేమనపల్లి,జులై 20,(జనంసాక్షి):మండలంలోని రాజారం గ్రామంలో చెన్నూర్ రూలర్ సీఐ విద్యాసాగర్ ఆదేశాల మేరకు నీల్వాయి ఎస్సై సుబ్బారావు గురువారం మూఢనమ్మకాలు,బాల్యవివాహాలు,సైబర్ నేరాలు,మద్యపానం,రోడ్డు ప్రమాదాలు,బాల కార్మికులు,సమాజంలో జరిగే నేరాల పైన “కనువిప్పు”కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ గ్రామాల్లో గంజాయి,సారా,గుట్కా,తంబాకు లాంటి మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన 100 నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, నిర్వహణ భాద్యత గురించి వివరించారు.శాంతి భద్రతల భాద్యత మన అందరి బాధ్యతని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.