మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ప్రభాకర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 15న స్టేషన్ రోడ్ లోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాల్ లో హైకోర్టు న్యాయవాది, బిఆర్ఎస్ మంచిర్యాల నియోజకవర్గం నాయకులు అక్కల తిరుపతి వర్మ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమం పోస్టర్ని మంచిర్యాల ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ప్రభాకర్ రావు ఆవిష్కరించడం జరిగింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించడంకొరకు మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిరుద్యోగ యువతీ,యువకులు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సధ్వినియోగ పరుచుకోవాలని తెలిపారు, సుమారు 4వేల ఉద్యోగాలు,70 కి పైగా కంపెనీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారని, నిరుద్యోగుల విద్యార్హతని బట్టి వారికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. జిల్లా నలుమూలలనుండి నిరుద్యోగులు వస్తారని, వారికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తిరుపతి వర్మ తెలిపారు.. నిరుద్యోగ యువతీ, యువకులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించి వారి కాళ్ళమీద వారు నిలబడేలా చెయ్యడమే నా లక్ష్యమని నిర్వాహకులు తిరుపతి వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య, ఆకుల రవీందర్, కొట్టె నాటేశ్వర్, శరత్ కుమార్, మహేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.