మెడికల్ అవర్నెస్ కార్యక్రమంలో భాగంగా..(ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ)

 

 

 

 

 

 

 

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై10.
సోమవారం రోజున రొయ్యురు సబ్ సెంటర్ అయిన ఏటూరునాగారం లోని రజక వాడలో గల సబ్ సెంటర్ లో, డ్యూటీ డాక్టర్ ఎస్. చాముండేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం సైడ్ కాల్వల్లో దోమల వ్యాప్తి నివారణకు పైరెత్రయం ద్రావణాన్ని స్ప్రే చేసారు. డాక్టర్ చాముండేశ్వరి మాట్లాడుతూ వానాకాలం లో సీజనల్ వ్యాధులు రాకుండా కాచి చల్లార బెట్టిన నీటిని త్రాగాలి అని అన్నారు. వ్యాధుల పట్ల సందేహం వస్తే, ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సబ్ సెంటర్ లో పరీక్షలు చేసుకోవాలని సూచించారు. జలుబు జ్వరం,విరోచనాలు వస్తే తగిన మోతాదులో సెంటర్లలో మందులు తీసుకోని వాడాలి అని ప్రజలను కోరారు. దోమకాటు వల్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల్లో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం పద్మ, ఆశా వర్కర్లు మాధవి,శారద, స్వరూప పాల్గొన్నారు.

తాజావార్తలు