మెస్ ఛార్జీలు పెంచుతాం: మంత్రి
గుంటూరు,అక్టోబర్30(జనంసాక్షి): సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచనున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందుఉల కలగకుండా నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయాన్నివెల్లడిస్తామని ఆయన చెప్పారు. సాంఘిక సంక్షేమ హస్టళ్లు, గురుకులాల సౌకర్యాల మెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. /ూష్ట్రవ్యాప్తంగా రూ.76 కోట్లతో గురుకుల పాఠశాలల్లో బంకర్ బెడ్లు, రూ.84 కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్టళ్లంటినీలో ఆర్వో ఎ/-లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను తెలుగుదేశం పార్టీ నూరు శాతం వారికే ఖర్చు చేస్తోందన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.19,500 కోట్లు సబ్‌ఎ/-లాన్ నిధులను ఖర్చు చేస్తే ఈ ఏడాది ఎస్సీ సంక్షేమానికి రూ.9వేల కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.3.5వేల కోట్లు నిధులు కేటాయించి సగానికి పైగా ఖర్చు చేశామన్నారు.