మైనార్టీ పాఠశాల వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన – సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

డోర్నకల్, జూలై 9 జనం సాక్షి న్యూస్ :
డోర్నకల్ పట్టణం లో ని మైనార్టీ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన.. పాఠశాలలో సరైన సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు. సరేనం మంచినీటి సౌకర్యం లేదని సరైన ఆహారం ఇవ్వడం లేదని. విద్యార్థులకు మంచినీళ్ల ట్యాంక్ ద్వారా కలుషిత మంచి నీరు అందిస్తున్నారని వారు ఆరోపణలు చేశారు. మైనార్టీ విద్యాలయాన్ని వెంటనే కురవి మండలం నికి తరలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా వెంటనే విద్యాలయాన్ని కురవి మండలనికి తరలించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…. మైనార్టీ పాఠశాల కురవి నుండి డోర్నకల్ కి నీవల్లే తరలించారు అంటూ అఖిల్ అనే వ్యక్తిపై దాడికి దిగిన విద్యార్థిలు తల్లిదండ్రులు. కావాలని దాడులకు పాల్పడ్డారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో సౌకర్యాలు లేకపోతే సంబంధిత పై అధికారులకు అడిగి తెలుసుకోని అందరం కలిసి ఉద్యమించాలి అంటున్న పట్టణవాసులు. వాటిపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని, హాస్టల్ వసతులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సరైన సౌకర్యాలు కల్పించాలని డోర్నకల్ పట్టణ వాసులు కోరుతున్నారు. మైనార్టీ స్కూల్ కురవి మండలానికి తరలిస్తామని విషయాన్ని ఖండిస్తూ నేడు డోర్నకల్ పట్టణంలో నిరసన కార్యక్రమం తెలుపుతామని డోర్నకల్ మైనార్టీ,పట్టణవాసులు తెలిపారు.

తాజావార్తలు