యువతకు అండగా నిలుస్తాం ఉద్యమ స్పూర్తితో రాష్ట్రమంతటా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం సిద్దిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం పరిశీలన

*మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. జనం సాక్షి దుబ్బాక
సిద్దిపేట; సిద్దిపేట ఉద్యమాలకు కేంద్ర బిందువని, సిద్దిపేట నుండి మొదలైన డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం నేడు రాష్ట్రమంతా కొనసాగుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమంను సిద్దిపేట డీటీవో కార్యాలయంలో ఆయన పరిశీలించారు.. ఈసందర్భంగా నియోజకవర్గ యువతతో మాట్లాడారు.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీటీవో దుర్గాప్రసాద్ ను ఆదేశించారు.. ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి కొంత మంది యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారని, పోలీసు చెకింగ్ సమయంలో ఇబ్బంది పడేవారని, ప్రమాదాలు జరిగినప్పుడు సైతం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయం లో సమస్యలు వొస్తున్నాయన్నారు..ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో సిద్దిపేట లో డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు..నేడు దుబ్బాక తో పాటు రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోనే 14 వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించామని, 3500 మందికి లర్నింగ్ లైసెన్స్ లు అందించడం జరిగిందన్నారు.విదేశాలలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బయటకు వాహనం వెల్లదని, భారత దేశంలో కూడా ఓటు హక్కు తరహాలో 18 ఏళ్ళు నిండిన వారందరికీ డ్రైవింగ్ లైసెన్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని తాను పార్లమెంటు లో మాట్లాడటం జరిగిందన్నారు…డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంతో పాటు వారికి వాహన డ్రైవింగ్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు..హెల్మెట్ లేకుండా ప్రయనించేవారు రోడ్డు ప్రమాదాల్లో తలకు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారని, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంతో పాటు హెల్మెట్ లు అందిస్తామని ఆయన తెలిపారు..

తాజావార్తలు