యువత మాతృ భూమి రుణం తీర్చుకోవాలి

తెనాలి రూరల్‌: మాతృభూమి రుణం తీర్చుకునేందుకు యువత ముందుకు రావాలని ఆర్డీవో నరసింహులు కోరారు. 1965 జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై విజయం సాధించి యాబైఏళ్ల సందర్భంగా నాటి యుద్ధంలో పాల్గొన్న వీరచక్ర పురస్కార గ్రహీత తాతా పోతురాజును వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. స్థానిక ఎన్‌ఆర్‌కే కల్యాణ మండపంలో జరిగిన ఈ సభలో ఆర్డీవో మాట్లాడుతూ, సాధారణ తుపాకీతో శత్రు దేశ విమానాన్ని కూల్చి ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోతురాజు యువ తరానికి ఆదర్శమన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని మాతృభూమి రుణం తీర్చుకోవాలన్నా రు. సభలో దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కృపాచారి, వివేకా విద్యా సంస్థల డైరెక్టర్‌ రావిపాటి వీరనారాయణ, స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి వెంకట్రావు, పసుపులేటి మోహనరావు, వజ్రాల రామలింగాచారి, విష్ణుమూర్తి, గోలి ఆంజనేయులు, హకీంజాని, అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

తాజావార్తలు