యోగాను జీవనశైలిలో ఒక భాగంగా అలవరచుకోవాలి -సీఐ రామలింగారెడ్డి, ఎస్సై హరికృష్ణ

హుజూర్ నగర్ జూలై 13(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో ఒక భాగంగా అలవరచుకోవాలని హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై హరికృష్ణ లు అన్నారు. గురువారం పట్టణంలోని వాసవి భవన్ నందు ఏర్పాటుచేసిన అనుష్టాన యోగా కేంద్రాన్ని సీఐ రామలింగారెడ్డి, ఎస్సై హరికృష్ణ ప్రారంభించారు.            ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగ అనేది ఏదో ఒక రోజు ఒక గంట సేపు చేసే ప్రక్రియ కాదని దానిని జీవనశైలిలో ఒక భాగంగా అలవరచుకోవాలన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. యోగా మాస్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ నేటినుండి మరో 100 రోజులపాటు వాసవి భవన్ నందు ప్రతిరోజు రెండు బ్యాచ్ లుగా క్లాసులు ఉంటాయని ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. యోగ క్లాసులకు వచ్చేవారు తప్పనిసరిగా యోగ మ్యాట్లు, వాటర్ బాటిల్, నోట్ బుక్ పెన్నుతో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, వీర్లపాటి రమేష్ , జానకి రాములు, సందీప్, ఉపేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు