యోగా ఆరోగ్యానికి మంచిది..

 

 

వరంగల్ బ్యూరో, ఆగస్టు 10 (జనం సాక్షి)వ్యక్తిత్వ వికాసానికి , ఆరోగ్యానికి యోగ సహాయ పడుతుందని, వారి ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుతూ,ఒత్తిడిని తట్టుకునే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుందని జిల్లా కోర్టు సూపరింటెండెంట్ ఇందిరా గారు అన్నారు. అనంతరం హరిత కాకతీయ హోటల్ నందు ప్రతిరోజు యోగా సాధనతో శారీరిక, మానసిక, ఆరోగ్యానికి పెంపొదించుకోవడానికి ఉపయోగపడుతుందని, యోగాతో సహజ సిద్ధంగా ఆరోగ్యం మంచిది అని అన్నారు. యోగా శరీరాన్ని మనసుకు ఏకం చేసి సంయోగం ప్రతిరోజు సాధన చేయాలని కోరారు. యోగా సాధనతో మనిషి చురుకుగా ఉండడమే కాకుండా మానసిక ప్రశాంతంగా పొందుతారు. యోగ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచి మానవాళి మనుగడకు సుఖమైన, ఆరోగ్యమైన జీవనాన్ని ఫలితంగా ప్రతి వ్యక్తి ఆనందమైన జీవితాన్ని గడిపేలా శరీరానికి యోగ ఎంతో గానో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఉరుకులు, పరుగులు కాకుండా జీవితంలో పది నిమిషాలు పాటు యోగాకు సమయం కేటాయిస్తే వందేళ్ళు ఆరోగ్యం మన సొంతం అవుతుందని తెలిపారు. యోగా ఆసనాల వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, యోగా సాధన తర్వాత మనిషి మనసు ప్రశాంతంగా మారడంతో పాటు సానుకూల దృక్పథం పెరుగుతుందని తెలిపారు. యోగా ఎంత ఎక్కువగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత అంతగా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు చారీ, హరి, రాజేందర్, రవిందర్, చిరంజీవి నాయక్, రాము, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు