యోగ వల్ల ఆరోగ్యానికి మేలు

వార్డు కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే

భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు05

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నరసింహ స్వామి కల్యాణ మండపంలో శుక్రవారం మూడు రోజుల పాటు మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై భైంసా మున్సిపల్ వార్డు కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే ,రావుల స్వర్ణ పోశెట్టి, జ్యోతి ప్రజ్వలన చేసి , 2 వ రోజు శిక్షణ తరగతులు ఆమె ప్రారంభించారు. అనంతరం శిక్షణ లో భాగంగా సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు , ప్రాణాయామాల విశిష్టతను తెలుపుతూ శిక్షణ ఇచ్చారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యకరమైన, సంతోషాదయక జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం తిప్పతీగ , హాలోవిర , తులసీ, అజవైన్, రణపాల, ఉసిరి తదితర ఔషధ మొక్కల విశిష్టతను క్లుప్తంగా వివరించి, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పతంజలి యోగ సమితి ప్రాంత ప్రభారీ మంజూశ్రీ, నిర్మల్ జిల్లా ప్రభారీ అలకనంద కర్వా , కరీంనగర్ జిల్లా ప్రభారీ , భారత్ స్వాభిమాన్ ట్రస్టు సభ్యులు గణపతి గాడేవార్, ప్రముఖ యోగా గురువు , సాధుల కృష్ణదాస్, కౌన్సిలర్ రావుల స్వర్ణ పోశెట్టి , ప్రముఖులు, పాల్గొన్నారు.

తాజావార్తలు