రహదారి ప్రమాదాలను తగ్గిస్తాం

అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న వెల్లడి

అమరావతి,నవంబర్‌30(జ‌నంసాక్షి): వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను 50శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై తమకుకూడా ఆందోళన కలుగుతోందన్నారు. ముఖ్యంగా యువత ప్రమాదాల్లో చనిపోవడంతో వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతంగా ఉందన్నారు. జిల్లాల్లో రహదారి ప్రమాదాలు తగ్గినా మరణాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టలేదని శాసనసభలో పేర్కొన్నారు. తిరుపతి-రాజంపేట మార్గాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని రహదారి ప్రమాదాలు తగ్గేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. తొలుత రహదారి భద్రతకు సహకరించిన పోలీసులు బందోబస్తు పేరిట ఇప్పుడు సహకరించడం మానేసారని మంత్రి తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్డుప్రమాదాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రం విూదుగా వెళ్తున్న జాతీయ రహదారిపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మృతుల్లో 40శాతం మంది యువతే ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

తాజావార్తలు