రహదారి విస్తరణలో రైతులకు న్యాయం చేయాలి

అనంతపురం,మే5(జ‌నం సాక్షి ):కొడికొండ చెక్‌పోస్టు నుంచి అగళి వరకు నూతనంగా ఏర్పాటు చేయబోయే జాతీయ రహదారి కోసం భూములు, ఇళ్లు బలవంతంగా లాక్కుంటే తామెలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  లేపాక్షి మండలంలో 150 మంది రైతులకు సంబంధించిన భూములు కొన్ని నివాస ప్రాంతాలు ఇతర శాశ్వత నిర్మాణాలు కోల్పోయే బాధితులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాతీయ రహదారి అభ్ఱివృద్ధికి సవిూప ప్రాంతాల వారు సహకారం అందించాలని ఇందుకు ప్రభుత్వం కూడా ఆర్థికసాయం అందిస్తుందని ఆర్‌డిఒ రామ్మూర్తి పేర్కొన్నారు. ఉన్నఫలంగా ఇళ్లను కూలదోస్తే ఎలా బతకాలని అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు గిట్టుబాటు ధర ఇస్తే తప్ప జాతీయ రహదారికి భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు  కోరారు.  నాలుగు లైన్ల రహదారిలో చిలమత్తూరు మండలంలో భూములు కోల్పోయిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.  బాధిత రైతులకు ఎకరాకు భూసేకరణ చట్ట ప్రకారం మార్కెట్‌ విలువలు అనుసరించి రూ.35లక్షలు 
చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతుల అభిప్రాయాలను సేకరించి వారి ఆమోదం తర్వాతనే పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో చర్చించి తీర్మానించినట్లు పేర్కొన్నారు.

తాజావార్తలు