రాజధానికి 500 అపార్టుమెంట్లు అద్దెకిస్తాం

రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులకు తాత్కాలిక వసతి కోసం 500 అపా ర్ట్‌మెంట్లు అ ద్దెకిస్తామని నా గార్జున యూనివర్సిటీ సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ ప్రతినిధులు గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేకు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం లింగమనేని సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేతో చర్చించారు. యూనివర్సిటీ ఎదురు విజయవాడ-గుంటూరు నగ
రాలకు అందుబాటులో, రాజధాని తుళ్లూరు సమీపంలో 500 అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు చెప్పారు. లింగమనేని ఎస్టేట్‌ నుంచి రవాణా సౌకర్యం బాగున్నట్లు చెప్పారు. జాతీయ రహదారి పక్కనే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేవని, లింగమనేని సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజధానిలో ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక వసతిని పర్యవేక్షించే కమిటీకి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. లింగమనేని ఎస్టేట్‌ను సందర్శించాలని కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను ఆ సంస్థ ప్రతినిధులు కోరారు

తాజావార్తలు