రాజధాని కోసం పరుగు

 తాడేపల్లి: రాజధాని కోసం పరుగు పేరిట ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ 5కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి ఏ ర్పాటు చేసిన వేదిక మీద నుంచి సీఎం 5కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం వారధి వం తెన మీద నుంచి కుంచనపల్లి వరకు నడకలో పాల్గొన్నారు. అంతకముందు జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజలు మెచ్చే ప్రపంచస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అని చెప్పారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో జరగాలని కోరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను విమర్శించడం జగన్‌కు అలవాటైపోయిందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ కార్యదర్శి విద్యాసాగర్‌ మాట్లాడుతూ పర్యాటక, ప్రజా రాజధానిగా నవ్యాంధ్ర రాజధాని ఏర్పడబోతుందన్నారు.
స్వల్ప తొక్కిసలాట
జిల్లా ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసి న 5కే రన్‌లో స్వల్ప తొక్కిసలాట జరిగిం ది. పోలీసులు స్పందించి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత బాగా ఉండడంతో పలువురు ఇబ్బందులకు గురయ్యా రు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయ ణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొం డా ఉమామహేశ్వరరావు, బోడె ప్ర సాద్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ నాయకు లు గంజి చిరంజీవి, దండమూడి మనోజ్‌కుమార్‌, జడ్పీటీసీ దండమూడి శైలజారాణి, ఆప్కో చైర్మన్‌ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ సంకా బా లాజీగుప్తా, నందం అబద్దయ్య, వల్లభనే ని సా యిప్రసాద్‌, ఆత్మకూరు సర్పంచ్‌ వింజమూరి జ్యోత్స్న, దర్శి వనరాణి, మహమ్మద్‌ ఇబ్ర హీం, ఇట్టా పెంచలయ్య, బెజ్జం రామకృష్ణ, చిన్నపోతుల చిన్నా, ఇట్టా భాస్కర్‌, షేక్‌ కాలేషా, కాట్రగడ్డ నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీనాథ్‌, అర వపల్లి శ్రీనివాస్‌, వీరిశెట్టి శ్రీనివాస్‌, షేక్‌ రియా జ్‌, అద్దంకి మురళీ, ఈపూరి కోటయ్య, కేబీ అం బేద్కర్‌, గోవాడ రవి, దుర్గారావు పాల్గొన్నారు.

తాజావార్తలు