రాష్ట్రంలో అతి భారీ వర్షాలు
వర్షాలు కారణంగా టిఎస్ ఆర్టీసీ సంస్థ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలి.!
భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దు..
వారం రోజులపాటు వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ పాటించవలసిన టిఎస్ ఆర్టిసి సంస్థ భద్రత సూక్తులు..
టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ పలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ చేశారు..
హైదరాబాద్, బస్ భవన్ (జనం సాక్షి ) :
మన ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించింది.
జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకున్న మన టిఎస్ ఆర్టిసి సంస్థకు ఉంది.
కాగా సుశిక్షుతులైన డ్రైవర్లు కలిగి ఉన్న సంస్థ ఆర్టీసీ సంస్థ.
వర్షాకాలంలో డ్రైవర్ సోదరులు మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందని – గౌరవ టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలియజేశారు..
ప్రస్తుతo తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా డ్రైవింగ్ సోదరులకు అత్యవసర ఉత్తర్వులను జారీచేసిన సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్
1. వర్షం కురుస్తున్నప్పుడు వేగనియంత్రణ పాటించవలెను.
2. మలుపుల వద్ద ఇండికేటర్ ను ఉపయోగించవలెను.
3. ముందు వెళ్ళే వాహనముతో సురక్షిత దూరాన్ని పాటించవలెను.
దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ వాడవలెను.
4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయునపుడు వైపర్ వాడవలెను.
హెడ్ లైట్ ను lowbeam లో మరియు ఫాగ్ lights తప్పనిసరిగా వాడవలెను. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు.
బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లవలెను.
5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపవలెను.
నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటవేసే ప్రయత్నం చేయవద్దు.
6. Windscreen గ్లాసులను వైపర్ తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్ తో శుభ్రపరచవలెను.
7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకొనవలెను.
8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించవలెను.
డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకొనవలెను.
9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు.
10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి.
11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు.
12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు.
13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు.
14. అతివేగంగా బస్సును నడపరాదు.
15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు.
16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు.
17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి.
18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు.
19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి.
నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు.
20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి.
21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది.
దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వారి యొక్క గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు.
22. చరవాణి మాట్లాడుతూ, మరియు ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు.
23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు.
24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు.
ఎంతో పేరున్న మన ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవరు మరియు కండక్టర్ గార్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సూచనలు జారీ చేశారు..