రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ప్రయత్నం
కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రుల సమావేశంలో బాబు ధ్వజం
2011 జనాభా లెక్కలను పరిగణన తగదన్న యనమల
రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని పిలుపు
అమరావతి,మే7(జనం సాక్షి): జనాభా నియంత్రణలో కేరళ ముందుందని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే కేరళలాగా ఉన్నట్టుండి జనాభాను తగ్గించడం సాధ్యంకాదన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం వెలగపూడిలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…అంతిమంగా అందరి లక్ష్యం పేదరిక నిర్మూలనేనని, పేదరిక నిర్మూలన కోసం అనేక విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తామంటే రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇచ్చారే తప్ప…విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాలనికి అదనంగా ఏవిూ ఇవ్వలేదన్నారు. అందుకే ఏపీ ఇంకా లోటు బ్జడెట్‌లోనే ఉందని సీఎం పేర్కొన్నారు. హేతు బద్ధతలేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం. ఇబ్బందులున్నా సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాం. వృద్ధిరేటును పెంచుకుంటూ పోతున్నాం. పారిశ్రామిక, సర్వీస్ రంగాల్లోనే ఆదాయం అధికంగా వస్తోంది. అన్ని రాష్టాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వనరులను సమర్థంగా వినియోగించుకున్న రాష్టాల్రు అభివృద్ధి చెందుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.15వ ఆర్ధిక సంఘం టీవోఆర్ ప్రకారం రాష్ట్రాలు ఆర్ధిక స్వాతంత్యా్యన్ని కోల్పోతున్నాయని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. యుద్ధ సమయంలోనే ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని, కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ
పరిస్థితుల్లోనూ… సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందని యనమల పేర్కొన్నారు. కానీ వాటిని తుంగలో తొక్కేలా చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేలా.. 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర సూచించిన విధివిధానాల నిబంధనలపై బాధిత రాష్ట్రాలు పోరు ప్రారంభించాయి. వెలగపూడి సచివాలయంలో 11 రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల కీలక సమావేశంలో యనమల మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవటం.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ ఉండగా.. కేంద్రం పన్నుల్లో 42 శాతం వాటా అవసరమా అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా శాతాన్ని పరిశీలించాలని 15వ ఆర్థిక సంఘాన్ని కేంద్ర కోరడాన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ 14వ ఆర్థిక సంఘం తీసుకున్న నిర్ణయం సరైందో కాదో పరిశీలించాలని, 15వ ఆర్థిక సంఘాన్ని కోరడాన్ని ప్రశ్నిస్తున్నాయి. బీజేపేతర రాష్ట్రాలు ఈ అంశంపై ఏకతాటిపైకి వచ్చి భాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి. 2011 జనాభా ప్రకారం కేటాయింపుల చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్ట పోతాయన్న వాదనపై కొంత మేరకు స్పందించిన 15వ ఆర్ధిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు అందే సవరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో తమకు వచ్చే నిధులపై రాష్ట్రాలన్నీ ఆత్మరక్షణలో పడ్డాయి. అవసరం వాటి మేరకు సొంతంగా పథకాలు నిర్వహించుకుందామనుకుంటే చేతిలో నిధులుండవు. ఏం చేయాలన్న కేంద్రం అండదండలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో 11 రాష్ట్రాలు మా సంక్షేమం మాకు వదిలేయండని అన్నాయి. కేరళలో గతంలో జరిగిన సమావేవానికి కొనసాగింపు అన్నట్లుగా ఇక్కడ అన్ని రాష్ట్రాల తమ హక్కుల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అంచనా వేస్తే ఏటా ఏపీకి రూ. 8 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్లకుగాను నష్టం రూ. 40 వేల కోట్లుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. విభజనతో అసలే నష్టపోయిన తాము కేంద్రం తీరు కారణంగా మరింతగా నష్టపోవాల్సి వస్తోందన్నారు.