రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

రాష్ట్ర స్థాయి అండర్ 19 బ్యాడ్మింటన్ బాల బాలికల, మిక్సీ డబుల్స్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం మంచిర్యాలలోని రంగంపేట లోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రేమా రాజేశ్వరి ఐపిఎస్,మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఐఏఎస్,అతిథులుగా మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్ హాజరు కాగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దపల్లి ఏ సి పి ఎడ్ల మహేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు, ఏసిపిలు తిరుపతి రెడ్డి, సదయ్య, బ్యాట్మెంటన్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గ ప్రసాద్ హాజరై ప్రారంభ వేడుకలలో పాల్గొన్నారు, ముఖ్య అతిథులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ పిల్లలకు కచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని తల్లిదండ్రుల పాఠశాలలో యజమాన్యాలు క్రీడలను ప్రోత్సహించాలన్నారు, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాలలో రాష్ట్రస్థాయి పోటీ నిర్వహించడం Avan మధ్యాహ్నం శుభ పరిణామం అని క్రీడలను ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందుంటామని తెలిపారు, ముఖ్యఅతిథి ముఖ్య అతిథులు, అతిథులు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకాలను ఉత్తిజపరిచారు, ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరకు భోజనం వసతి సౌకర్యం కల్పించారు, 14వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయని బుధవారం మొదటి రౌండ్ పోటీలు జరిగాయి, ఈ కార్యక్రమంలో ట్రస్మ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్, ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ చంద్రమోహన్ గౌడ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, జాయింట్ సెక్రటరీలు రమేష్ రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు పళ్లెం కృష్ణ, నరేందర్, అవిన్ బాబు, క్రీడాకారులు, క్రీడభిమానులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు