రాష్ట్ర మంత్రివర్గం అంశాలపై పలు చర్చలు

హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం నాలుగు గంటలపాటు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న పలు అంశాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూ కేటాయింపు విధానం-2011కు మంత్రివర్గం ఆమోదం లభించింది. కర్నూలులో ప్రత్యేక ఏసీబీ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. వివిధ శాఖల్లో 12,864 కొత్త ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గ ఆమోదం. రాష్ట్రంలోని 7 సహకార చక్కెర పరిశ్రమలకు రూ.180 కోట్ల మేర రుణం కల్పించేందుకు ఆమోదం. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందానికి ఆమోదం. ఎస్సీ ఎస్టీ నివేదికను అన్ని శాఖలకు పంపి తర్వాత కేబినేట్‌లో చర్చించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యుత్‌ బాండ్ల ద్వారా రూ. 4 వేల కోట్ల నిధుల సేకరణకు మంత్రివర్గం నిర్ణయించింది.

తాజావార్తలు