రేవంత్‌ రాజీనామా నాకు తెలియదు

పార్టీలో ఇలాంటివి సహజమే అన్న బాబు

అమరావతి,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): రేవంత్‌ రెడ్డి రాజీనామా చేసినట్లు తనకు తెలియదని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతేకాకుండా రేవంత్‌ రాజీనామ లేఖ కూడా తనకు అందలేదని ఆయన చెప్పడం గమనార్హం. ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు… రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ముఖ్యనేతలందరూ ఉదయమే వెళ్లగా రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి మాత్రం మధ్యాహ్నం సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే… రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో చంద్రబాబు పీఏకు రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను అందజేసి వెనుదిరిగారు. ఆ సందర్బంగా మధ్యాహ్నం భోజనానికి చంద్రబాబు వెళుతుండగా ఆయనకు రేవంత్‌రెడ్డి నమస్కారం పెట్టి బయటకు వచ్చారు. అనంతరం రేవంత్‌ నేరుగా హైదరాబాద్‌ బయలుదేరారు. టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి రాజీనామా వ్యవహారంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీలో రాజీనామాలు కొత్త కాదని, తమ భవిష్యత్‌ కోసం నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని వెయిట్‌ చేయమని చెబితే తను వెళ్ళి పోయాడని, ఆయన రాజీనామా లేఖ తనకు అందలేదని చంద్రబాబు అన్నారు. రాజీనామా పత్రాన్ని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి రేవంత్‌ అందజేసి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు.

విదేశి పర్యటన నుంచి వచ్చిన సీఎం చంద్రబాబు టీటీడీపీ వివాదంపై దృష్టిపెట్టారు. శుక్రవారం లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి హాజరై.. రేవంత్‌రెడ్డి కొద్దిసేపు ఆలస్యంగా వచ్చారు. ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. దాంతో అందరూ శనివారం అమరావతికి రావాలని ఆదేశించారు. ఈ భేటీకి ముఖ్య నేతలందరూ ఉదయమే వెళ్లగా రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి మాత్రం మధ్యాహ్నం సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డికి చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. రేవంత్‌ రాజీనామా చేయడం అందరూ ఇక రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావిస్తున్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయినట్లు విూడియా విస్తృతం ప్రచారం జరిగింది.

తెలంగాణ టీడీపీ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు స్పందించారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌కు చెందిన సుంకర సుజాత అనే మహిళను బెదిరించినట్లు నామాపై పోలీస్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చంద్రబాబు.. నామా నాగేశ్వరరావు అంశం తన దృష్టికి రాలేదన్నారు. అయినా అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అని.. దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. శనివారం తెలంగాణ టీడీపీ నేతలతో అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్‌ రెడ్డి రాజీనామాతో పాటు.. నామా నాగేశ్వరరావు వ్యవహారంపై స్పందించారు.

తాజావార్తలు