రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై 12. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో
బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గడదాసు.సునీల్ కుమార్ మండల కమిటీ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య లకు నిరసన గా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ,తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుంటే రైతులకు 3,గంలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో ఎన్ ఆర్ ఐ, మీట్ అండ్ గ్రీట్ లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ,అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని
సీఎం కెసిఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల గురించి ఆలోచించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కొరకు రైతులకు ఇస్తున్న సంక్షేమ పథకాలను ఓర్చుకోలేని టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,
అటు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు రైతులను ఏనాడు పట్టించుకోలేదు పైగా నిర్లక్ష్యం చేశారు.
దేశాన్ని పాలిస్తున్న పార్టీలు వ్యవసాన్ని,రైతులను చులకనగా చూస్తున్నారు.
సీఎం కెసిఆర్ రైతు ఉన్నతికి రైతు బంధు,రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టారు.
ఈ పథకాలలో ఏమి రాజకీయం వుందో ప్రతిపక్షాలకే తెలియాలి,రైతు పంట పండించుకోవడానికి ఉచిత కరంటు ఇస్తే అది తప్పా,.కరెంట్ 3 గంటలు ఇస్తే సరిపోతుందా..,రేవంత్ రెడ్డి .
3 గంటలు కరెంట్ ఇస్తే రైతులకు సరిపోతుందా….?!
తెలంగాణ రాష్ట్రంలోని రైతుబిడ్డలందరూ మీ దివాలా కోరు మాటలను గమనిస్తున్నారు.
గతం లో విద్యుత్ కోసం కండ్లు కాయలు చేసుకొని లాంతర్లతో,కిరిసిన్ దీపాలు, టార్చ్ లైట్ వెలుతురులో, కరెంట్ షాక్ తో చీకట్లో పాము కాటుకు గురై,కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతమంది రైతులు కరెంటు సాగుతో చనిపోయారు ఎంతమంది రైతులకు విత్తనాలు ఎరువులు అందక అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు బిడ్డనని చెప్పుకుంటున్న మీకు తెలియదా! రేవంత్ రెడ్డి.రైతులు సరైన సమయం కొరకు ఎదురుచూస్తున్నారు, కర్రు కాల్చి వాత పెట్టే సమయము ఆసన్నమైంది.
ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు.
వడ్లు తడిస్తే రాజకీయం, తడిసిన వడ్లు కొంటే రాజకీయం ,
వడ్లు కొనేందుకు రాజకీయం,  కొన్న వడ్లకు పైసలు ఇచ్చే కాడ రాజకీయం
అన్నీ రాజకీయాలు చేసేది కాంగ్రెస్, బీజేపీ పార్టీలే,
ఏ రాజకీయం లేకుండా రైతుకు న్యాయం జరగాలన్న తపనతో పథకాలు అమలు చేస్తూన్న నాయకుడు సీఎం కెసిఆర్  అబ్ కీ బార్ ..కిసాన్ సర్కార్ అని నినదిస్తూ, రైతుల తరుపున నిలదీస్తున్న ఏకైక నేత కేసీఆర్.
రైతులు సీఎం కెసిఆర్ ని, కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.
వారికి రైతులంతా అండగా వున్నారు. రైతులు, రైతు వ్యతిరేకుల మాటలు పట్టించుకోరు అని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పీఏసీఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్,సీనియర్ నాయకులు తుమ్మ.మల్లారెడ్డి, ములుగు జిల్లా మైనార్టీ సెల్ ఇంచార్జ్ ఎండి ఖాజా పాషా. ఎంపీటీసీ కుమ్మరి స్వప్న చంద్రబాబు
దన్నపునేని కిరణ్. అల్లి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇట్టం నాగరాజు,సర్పంచ్ ఈసం రామ్మూర్తి,దొడ్డ కృష్ణ,సప్పిడి రాంనర్సయ్య,మాదరి రామయ్య,ఎగ్గడి కోటయ్య, ఆనంద్,రమేష్,జాడి.బోజారావు,కాల రామకృష్ణ, బట్టు రమేష్, కొండాయి చిన్ని, మందపెళ్లిచంద్రం,వావిలాల ముత్తయ్య,కందగట్ల శ్రీనివాస్,మహిళ అధ్యక్షురాలు ఈసం స్వరూప,బండి లక్ష్మి,కొండ గొర్ల తిరుపతి, వావిలాల మోహన్,ఆత్కూరి రాంబాబు,రైతులు దాసరి బుజ్జయ్య, రత్నం నరసింహారావు,ఆకుల రోశయ్య,ఇరుసవడ్ల భాస్కర్,ఇట్టం శంకర్, ఆదినారాయణ,శ్రీరామ్ రమేష్, పల్ల మల్లికార్జున్, జగదీష్,అల్లినరసింగరావు, సత్యనారాయణ,అరుణ్,మంచాల ముకుందం, బొల్లె రాంబాబు,ఉప్పలవెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు