రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దబ్బాని వెంకట్
మోమిన్ పేట జూలై 12 జనం సాక్షి
ఉచిత కరెంట్ వద్దు-ధరణి వద్దు అంటున్న హస్తం పార్టీని బొంద పెట్టాలి. రైతులకు ఉచితంగా ఇచ్చే పథకాలపైన రేవంత్ రెడ్డి హక్కాస్ ఏంటి
యూరియా బస్తాలకు రైతులు చెప్పులు లైన్లో పెట్టేలా చేసింది కాంగ్రెస్ పార్టీ
24 గంటలు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వందే. బుధవారం మోమిన్ పేట్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దబ్బాని వెంకట్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం నిరంతరం ఆలోచన చేస్తూ వ్యవసాయం కొరకు 24 గంటల ఉచితంగా కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలను కాపాడుతుంటే ధరణి రద్దు చేస్తాం ఉచిత కరెంట్ అవసరం లేదు అని దిమకు తక్కువ మాటలు మాట్లాడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని,రైతులు రోడ్లు మీదకు వచ్చి యూరియా కట్టల కోసం రోజుల తరబడి నిలబడి చెప్పులు లైన్ లో పెట్టుకొని ఉన్న రోజులు మళ్ళీ వచ్చేలా పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి.హస్తం పార్టీని తెలంగాణలో శాశ్వతంగా బొంద పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ దళిత రత్న అవార్డు గ్రహీత బిచ్చయ్య పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచులు నర్సింలు శ్రీనివాస్ రెడ్డి కాశీరాం అంజయ్య మండల మైనార్టీ నాయకులు మహబూబ్ అలీ మహిపాల్ డప్పు చందు రవి నాయక్ ఎంపిటిసి సభ్యులు పిఎసిఎస్ డైరెక్టర్లు మాజీ సర్పంచులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు