రైతుభీమా కోసం నమోదు చేసుకోవాలి


శివ్వంపేట జూలై 10 జనంసాక్షి : రైతులందరూ జులై 10 నుండి ఆగస్టు 5వ తేదీ లోపల రైతుబీమా కోసం సంబంధిత ఏఈఓ క్లస్టర్లలో నమోదు చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రాంరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మండల కేంద్రమైన శివ్వంపేట లో విలేఖర్ల తో మాట్లాడుతూ రైతు బీమా ఆవశ్యకతపై వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకంతో పాటుగా ప్రతిష్టాత్మకంగా రైతుబీమా కూడా రైతులకు అందిస్తుందన్నారు. కాబట్టి రైతులందరూ సకాలంలో రైతు బీమాకోసం త్వరగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రైతుకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాలకు కొంతమేర ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అందిందడానికి రైతుబీమా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా ఈ యొక్క పథకాన్ని ముందుకు సాగిస్తుందనీ ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ సీఈవో మధు యాదవ్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు