రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి: మంత్రి సునీత
అనంతపురం,మే14(జనం సాక్షి): అనంతపురం జిల్లా రామగిరి అగ్రికల్చర్ గోడౌన్‌లో వేరుశనగ విత్తనాలను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. గోడౌన్‌లోని విత్తనాల నాణ్యతను పరిశీలించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. రైతులు కూడ విత్తనాలు తీసుకునేపుడు పరిశీలించి నాణ్యతగా ఉంటేనే తీసుకోవాలి నాణ్యత లేని వాటిని వెనక్కి ఇచ్చి రైతులు నాణ్యమైనవి తీసుకోవాలని తెలిపారు. రామగిరి మండలానికి 8 వేల క్వింటాళ్లు వేరుశెనగ విత్తనాలు కేటాయించినట్లు తెలిపారు. విత్తనాలను సకాలంలో రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు.