రైతులకు న్యాయం జరుగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలి ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి పై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ -హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
జనం సాక్షి సైదాపూర్ రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కోరారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రవీణ్ రెడ్డి సోమవారం సైదాపూర్ మండలం బొమ్మకల్ – గొల్లపల్లే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోరుకునేది కాంగ్రెస్ పార్టీ నేనని, రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని గ్రామస్తులను కోరారు. మొట్ట మొదటగా ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, 24 గంటల కరెంటు ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అన్నారు. ఉచిత విద్యుత్ విషయం లో జరిగే అవినీతి ఎక్కడ బయట పడుతుందో అని టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ బురద జల్లుతుందని అన్నారు. కావాలని దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రైతులందరికి రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే నని అన్నారు. అధికారం లోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల ఋణ మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాటిని అగ్గిపెట్టెల్లా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారని, ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నియోజక వర్గం లో ఎన్ని డబుల్ బెడ్ రూం లు ఇచ్చారో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీ తోనే బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు, రైతులకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు మహిళలకు, గ్రామస్తులకు, యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.