రైతులకు ప్రోత్సాహక కార్యక్రమాలు

చిత్తూరు,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పంటల సాగులో రైతులు యాంత్రీకరణ పద్ధతులు అవలంబించడం విస్తరిస్తున్నది. ప్రభుత్వం కూడా మరింత విస్తరణకు పలు ప్రోత్సాహక రాయితీ పథకాల ద్వారా ఆధునాతన ఉపకరణాలు రోటవేటర్లు, పవర్‌టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, పలు రకాల స్పేయ్రర్లు, ట్రాక్టర్‌ నడిచే యంత్రాలు,

వరి కోత యంత్రం తదితర ఉపకరణాలను రాయితీపై అందచేస్తున్నది. ఉపకరణాల మరమ్మత్తులకు మెకానిక్‌లు అందుబాటులో లేకపోవడంతో రైతులు సుదూర ప్రాంతాలకెళ్లి పునరుద్దరించుకుంటున్నారు. తద్వారా వ్యయప్రయాసాలకు గురికావడంతో పాటు అధిక మొత్తంలో ఖర్చులతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఈ ఉపకరణాల మరమ్మత్తులకు మండలానికి ఇద్దరు ముగ్గురు చొప్పున నిరుద్యోగ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రావిూణ ప్రాంత మెకానిక్‌లుగా తయారుచేసేందుకు చర్యలు చేపట్టారు. తద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి లభించడంతో పాటు సకాలంలో ఉపకరణాల మరమ్మతులు పూర్తి చేసి రైతులకు చేయూతగా ఉంటారనే సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేశారు. వీరికి వ్యవసాయ ఉపకరణాల పనితీరు, మరమ్మత్తు పనులకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. దీనిని రైతులు వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ పనిముట్లు,ఉపకరణాల మరమ్మత్తులో రైతులకు శిక్షణ ఇవ్వడంతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. స్వయం ఉపాధిలో భాగంగా గ్రావిూణ మెకానిక్‌లుగా రాణించాలని అధికారులు అన్నారు. రైతులు గ్రావిూణ మెకానిక్‌ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

తాజావార్తలు