రైతులకు మద్దతు దరలు దక్కేలా చూడాలి
అధికారులకు సిఎస్ ఆదేశాలు
అమరావతి,జనవరి22(జనంసాక్షి): ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశాలు ఇచ్చారని తెలిపారు. రైతుకు ప్రయోజనం కలిగించేందుకు ధాన్యం సేకరణ కేంద్రాలని పేర్కొన్నారు. నీరు- వ్యవసాయం పురోగతిపై సోమవారం ఉదయం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా శ్రద్ధ వహించాలన్నారు. రైస్ మిల్లర్లులు, ధాన్యంకోనుగోలు దారులు దుర్వినియోగం చేయకుండా చూడాలన్నారు. 4 జిల్లాలో రబీ పంట రుణాల పంపిణీ మందకొడిగా ఉంది. శ్రీకాకుళం, కర్నూలు, విజయనగరం , నెల్లూరు జిలాలలో పంట రుణాలు వేగవంతం చేయాలి. ధాన్యసేకరణ కేంద్రాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కృష్ణా , గుంటూరులో కౌలు రైతులకు పంట రుణాలు వేగవంతం చేయాలి. ధాన్యం రీసైక్లింగ్‌కు తీసుకొచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్ లో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి మార్గదర్శకాలు ఇచ్చారని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. ప్రతి రైతుకు మద్దతుధర లభించేలా శ్రద్ధవహించాలని ఆయన చెప్పారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఎస్ వ్యాఖ్యానించారు.