రైతులను ఆదుకోవాలి
అనంతపురం,ఆగస్ట్29(జనంసాక్షి):సకాలంలో వర్షాలు కురవకు ముందస్తు వర్షాలకు విత్తుకున్న రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. సాగుచేసిన పంటకు కచ్చితంగా చేతికి వస్తుందనే నమ్మకం లేదన్నారు. రెయిన్ గన్లతో రైతులను ప్రభుత్వం మభ్యపెడుతోందని పేర్కొన్నారు. రైన్‌గన్‌ల పనితీరు వాస్తవానికి విరుద్దంగా ప్రభుత్వం ప్రచారం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. రెయిన్‌గన్ల సాకుతో రైతులకు పంటనష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమాలను ఎగ్గొట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపన్నారని తెలిపారు. జిల్లాలోని రైతులందరికీ
ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటికి 40 శాతం మందికి ఇవ్వలేదన్నారు. జిల్లాలో లక్ష ఫారంపాండ్ గుంతలను తీసి వాటిలో నిల్వఉన్న వర్షపునీటిని రెయిన్ గన్ల ద్వారా పంటరక్ష తడులు ఇస్తామని జిల్లా అధికారులు ఊకదపుండు ఉపన్యాసాలు ఇచ్చారని, వాస్తవంలో అవి ఏమాత్రమూ ఉపయోగపడలేదన్నారు. వరుస కరువులతో భవిషత్తును దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు వర్షాలకు వేరుశనగ సాగుచేసి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు నీరు ఇస్తామని హావిూ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్న రైతులు నేడు పంట రక్షక తడులను ఇవ్వడానికి ముందుకు రాలేదన్నారు. రెయిన్‌గన్ల పంపిణీకి కోట్లు ఖర్చు చేసిన జిల్లా కలెక్టర్ అవి రైతులకు ఎంత వరకు ఉపయోగపడ్డాయో తెలుపాలని ప్రశ్నించారు.