రైతుల అకౌంట్ల లాక్ ఎత్తివేయాలీ..యూనియన్ బ్యాంకు మేనేజర్ కు ప్రజాపంథా నాయకుల వినతి..

ఇల్లందు జూలై 10 (జనం సాక్షి న్యూస్)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ప్రజా పంధ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆధ్వర్యంలోయూనియన్ బ్యాంక్ మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
పాత బకాయిలు కట్టలేదనే నెపంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రైతుల అకౌంట్లో పడిన డబ్బులను డ్రా చేయకుండా రైతుల అకౌంట్ల కు బ్యాంకు అధికారులు లాకులు వేయడం సరైంది కాదని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ఇల్లందు పట్టణంలో సోమవారం యూనియన్ బ్యాంక్ ముందు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై వ్యవసాయానికి పెట్టుబడి సేకరించటంలో ప్రభుత్వం అందిస్తున్న రైతుబందు, కళ్యాణ లక్ష్మి,రైతుల పంటల డబ్బులు,రైతు బీమా, పంట నష్టపరిహారం, ఆసరా పెన్షన్లు, తదితర డబ్బులను బ్యాంకు అధికారులు చెల్లించకుండా అకౌంట్లకు లాక్ లు వేయడంతో రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారని అన్నారు. కార్పోరేట్ యాజమాన్యాలు బ్యాంకులకు తప్పుడు నివేదికలు సమర్పించి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నేరస్తులను వదిలేసి దేశానికి అన్నం పెట్టే రైతులపై బ్యాంకుల అధికారులు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి విరుచుకు పడడం ఎంతవరకు సరైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్యాంక్ అధికారుల మొండి వైఖరి వీడి రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారి అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేసుకునే అవకాశం కల్పించి లాక్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న, ప్రజాపందా ఇల్లందు డివిజన్ కార్యదర్శి నాయిని రాజు, ఎంఎల్ ప్రజా పందా ఇల్లెందు మండల కార్యదర్శి పూనెం కుమార్,అజ్మీర బిచ్చ, బుర్ర రాఘవులు, దేవా, కోటేష్ ,జి భాస్కర్ పోలవరం ఉప సర్పంచ్ కోటయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు