రైతుల పక్షపాతి కెసిఆర్ – రుణమాఫీ చేసినందుకు కెసిఆర్ చిత్ర పటానికి పాలభిషేకం


వీర్నపల్లి, ఆగష్టు 03(జనంసాక్షి): రైతులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేర్చారని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం నాడు 19,000 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి ఆద్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి గురువారం రోజున కెసిఆర్ చిత్రపటానిక పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, అందులో భాగంగానే నేటి నుంచి రైతుల రుణమాఫీలను చేయడం హర్షణీయమన్నారు. రైతుల పక్షపాతి అయిన కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ భారీ మెజారిటతో గెలిచి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ రుణ మాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కెసిఆర్ ఇచ్చిన నిలబెట్టుకున్న నాయకుడని తప్పకుండా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గుగులోతు కళావతి, ఎంపిపి మాలొతు బూల, వీర్నపల్లి గ్రామ సర్పంచ్ పాటి దినకర్, బంజారా సంఘం అధ్యక్షుడు గుగులోతు సురేష్, శాంతినగర్ గ్రామ సర్పంచ్ మల్లేశం, బిఆర్ఎఎస్ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు శ్రీరామ్, బిఆర్ఎఎస్ యూత్ మండల ఉపాధ్యక్షుడు దేవరాజు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భగవంతం, సంతోష్, పృధ్వీరాజ్, ఎలియాజర్, అశోక్, మొజేస్, కర్ణాకర్, దేవేందర్, మద్దివేణి లక్ష్మినారాయణ, నరేష్, ప్రవీణ్, లింబయ్య, నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు