రైలులో అత్యాచారయత్నం

విజయవాడ, ఆగస్టు 3 : రైలులో ప్రయాణిస్తున్న మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఒక నావీ ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు విజయవాడ రైల్వే పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. అలెప్పి నుండి టాటా స్టీల్‌ సీటీకి వెళుతున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఈ తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. ఆ రైలుకు గల ఒక బోగీలో ప్రయాణిస్తున్న బాధితురాలు బాత్‌రూంకు వెళ్ళగా నావీ ఉద్యోగి అందులోకి ప్రవేశించి అత్యాచారయత్నం చేశాడు. ఆ బాలిక అరుపులకు ఇతర ప్రయాణికులు అప్రమత్తమై బాత్‌రూం తలుపు పగులగొట్టి బాలికను రక్షించారు. నావీ ఉద్యోగిని కూడా వారు నిర్భందించారు. ఈలోగా విజయవాడ రైల్వే స్టేషన్‌ రావడంతో, అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని అప్పగించారు. నావీ ఉద్యోగి విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నట్లు తాగిన మైకంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజావార్తలు