రైల్వేల ప్రైవేటీకరణకు కుట్ర: సిఐటియు

 విజయవాడ,మే10(జ‌నం సాక్షి): భారతీయ రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరణగావించి విదేశీ పెట్టుబడి దారులకు, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అమ్మే ప్రయత్నాలు ప్రజానీకానికి చాలా నష్టదాయకమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు. ఇలా చేయడం దేశానికి మంచిది కానద్నారు. రైల్వేల ప్రైవీటీకరణనను అడ్డుకుంటామని అన్నారు. విజయవాడలో డిఆర్‌ఎం ఆఫీసు వద్ద దీక్ష చేపట్టిన రైల్వే కార్మికులకు ఆయన మద్దతు తెలిపి, మాట్లాడారు. కనీస వేతనం 7వ పే కవిూషన్‌ సిఫార్సు ప్రకారం, డాక్టర్‌ ఆక్టాయ్రిడ్‌ పార్ములా ప్రకారం రూ.26 వేలు నిర్ణయించకుండా రూ.18 వేలు మాత్రమే కనీస వేతనం ఇవ్వడం నేటి మార్కెట్‌ ధరలకు ఏ మాత్రం సరిపోదు. ఈ ప్రభుత్వ విధానాలు బడా బాబులకు, కార్పొరేట్‌ సంస్థలకు దేశ సంపదను అప్పనంగా కట్టబెడుతూ కార్మిక హక్కులను నిరాకరిస్తున్నదన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలి. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 
చట్టాలను, హక్కులను బిజెపి ప్రభుత్వం హరించివేస్తుందన్నారు.

తాజావార్తలు